📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సిరిసిల్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి20
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట 12వ వార్డులో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుర నిర్మల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డుకు చెందిన అబ్బగోని దేవవ్వ (భర్త లచ్చయ్య)కు రూ.60,000లు, బోడ వాణి (భర్త నాగరాజు)కు రూ.42,000ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి నివాసాల వద్దే అందజేశారు.ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలాంటిదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీనివాస్, కొలనూరి రమాదేవి, కోడం నాగభూషణం, కత్తెరపాక ఎల్లయ్య, తడక వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, మ్యాన సత్యనారాయణ, ఎండి కలీం, పాతూరి తిరుపతిరెడ్డి, నర్మెట శంకర్, పద్మనాభం, గుడిసెట్టి బాలరాజు, ఎల్లయ్య, రాజు, రవి, దశరథం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.