📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇంటర్ విద్యా బలోపేతానికి గ్రామ పంచాయతీల పూర్తి సహకారం

ఇంటర్ విద్యా బలోపేతానికి గ్రామ పంచాయతీల పూర్తి సహకారం

📰 Generate e-Paper Clip

ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు హామీ
మనకొండూరు,జనవరి3(మనప్రజాప్రతినిధి):
ఇంటర్ విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి గ్రామ పంచాయతీలు తమ వంతు సహకారం అందిస్తాయ ని ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు స్పష్టం చేశారు.
ఇల్లంతకుంట మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఈ కార్యక్రమానికి హాజరై విద్యా అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కళాశాల విద్యార్థుల హాజరు పెంపు, డ్రాప్అవుట్ విద్యార్థుల సంఖ్య తగ్గింపు, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అంశాలపై కళాశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపాల్ దేవరాజం సర్పంచ్‌లకు వివరించారు.ఈ సమావేశంలో మాట్లాడిన సర్పంచ్ మామిడి రాజు,పరిమిత వనరుల మధ్య కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రిన్సిపాల్‌ మరియు అధ్యాపకులు చేస్తున్న కృషి అభినంద నీయమని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.గ్రామ స్థాయిలో విద్యకు అనుకూల వాతావరణం కల్పించడంలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సర్పంచ్‌లు అభిప్రాయపడ్డారు. కళాశాల విద్యా నాణ్యత మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కళాశాల కు నియమితంగా హాజరయ్యేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశం ద్వారా కళాశాల–గ్రామ పంచాయతీల మధ్య సమన్వయం మరింత బలోపేతమైందని, భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ఇది దోహదపడు తుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వివిధ గ్రామాల నూతన సర్పంచ్‌లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.