📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

📰 Generate e-Paper Clip

మహిళల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసినమహనీయురాలు-ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి3
ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో–ఎడ్యుకేషన్), సిద్దిపేటలో సామాజిక సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన అధ్యాపకురాలు రాజ్యలక్ష్మి, షాహన కౌసర్, ఫాతిమా గార్లను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయురాలని కొనియాడారు. ఎన్నో సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచారని తెలిపారు. మహిళా విద్యకు ఆమె చేసిన సేవలకు గుర్తుగా ఆమె జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు.
యన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నాగేష్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించారని అన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని ఆమె జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు.స్టూడెంట్ కౌన్సిలర్ ఫాతిమా మాట్లాడుతూ, మహిళల సాధికారతకు సావిత్రిబాయి పూలే ఆదర్శమని, విద్యార్థులు ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ అశోక్, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు రఘురాజు, గంగాధర్, దాస్, రాజ్యలక్ష్మి, కౌసర్, బేతి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, ప్రసాద్, చక్రవర్తి, అఖిల్, రవి, విజయ్ భాస్కర్, రాజశేఖర్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.