📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి జిల్లాలో బీజేపీ యువమోర్చాకు కొత్త ఊపు… జిల్లా అధ్యక్షుడిగా బండారు పార్థసారథికి ఘన సన్మానం.

తిరుపతి జిల్లాలో బీజేపీ యువమోర్చాకు కొత్త ఊపు… జిల్లా అధ్యక్షుడిగా బండారు పార్థసారథికి ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

•యువతను పార్టీలో చురుకుగా భాగస్వామ్యం చేయడమేలక్ష్యంగా కొత్తజిల్లా అధ్యక్షుడు

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి13
బీజేపీ యువమోర్చా (బీజేపీవైఎం) తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన బండారు పార్థసారథిని బీజేపీ సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు. తిరుచానూరు మండలంలో బీజేపీ సీనియర్ నాయకుడు తిరునామలి రూపేష్ బాబు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.రూపేష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్థసారథికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు కలిగిన బండారు పార్థసారథికి ఈ బాధ్యతలు అప్పగించడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. తిరుపతి జిల్లాలో బీజేపీ యువమోర్చా కార్యకలాపాలను విస్తరించి, యువతను పార్టీలో చురుకుగా భాగస్వామ్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండారు పార్థసారథి మాట్లాడుతూ, తనపై పార్టీ ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి పూర్తి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుచ్చానూరు మండలాధ్యక్షుడు శుభకర, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు నాగరాజు రెడ్డి, కార్యదర్శి లేవాకు ప్రసాద్, అలాగే రాజ్ కుమార్, సుధాకర్, చంద్రబాబు, భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొని కొత్త జిల్లా అధ్యక్షుడికి మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.