📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొలనూర్ – రామన్నపేట కల్వర్టు పనులకు మోక్షం

కొలనూర్ – రామన్నపేట కల్వర్టు పనులకు మోక్షం

📰 Generate e-Paper Clip

వర్షాకాల కష్టాలకు శాశ్వత పరిష్కారం: కొలనూర్–రామన్నపేట కల్వర్టులురూ.1.90 కోట్లతో రెండు వంతెనల నిర్మాణం
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో నెరవేరిన దశాబ్దాల కల
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి11
వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం కొలనూర్, రామన్నపేట గ్రామస్థుల ఏళ్లనాటి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ప్రధాన అడ్డంకిగా మారిన కల్వర్టుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
రూ.1 కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు కల్వర్టుల పనులను ఆదివారం కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ఈ పనులకు నిధులు మంజూరవడం గమనార్హం.
ఈ సమస్యను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేరుగా శాసనసభ దృష్టికి తీసుకెళ్లి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రత్యేక నిధులు మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తీరనున్న రవాణా కష్టాలు
కల్వర్టు పనులు పూర్తయితే కొలనూర్ – రామన్నపేట గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు ఉప్పొంగిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు శాశ్వత విముక్తి లభించనుంది.
తమ సమస్యను అసెంబ్లీ వరకు తీసుకెళ్లి నిధులు సాధించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.