📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాచర్ల తిమ్మాపూర్ శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రాచర్ల తిమ్మాపూర్ శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

•ఆలయఅభివృద్ధి, ధార్మికకార్యక్రమాలే లక్ష్యంగా నూతనకార్యవర్గం ఏర్పాటు.
•అన్ని కులసంఘాల ఏకాభిప్రాయంతో కమిటీఎంపిక.
•గ్రామపాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎన్నికప్రక్రియ.

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18
రాజన్న సిరిసిల్ల జిల్లా మండల పరిధిలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ అందే సుభాష్, ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్, పాలకవర్గ సభ్యులు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ ఉత్సాహభరితంగా సాగింది.ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
నూతన కమిటీ వివరాలు:
అధ్యక్షులు: చెట్కూరి దినేష్
ఉపాధ్యక్షులు: అల్లే శంకర్
ప్రధాన కార్యదర్శులు: గట్ల అనిల్, పట్టురి రాజేశం గుప్తా
సహాయ కార్యదర్శులు: తీగల నాగరాజు, కంభోజ రమేష్
కోశాధికారులు: కొండా నారాయణ, కొలకాని పెద్ద నర్సయ్య
కమిటీ సభ్యులు:అల్లే తిరుపతి, ఆబ్బెని గోపాల్, కల్వకుంట్ల హనుమంత రావు, కొండా ప్రశాంత్, నల్లనాగుల భరత్, బీమరి శేఖర్, చాట్ల దేవరాజ్, అక్కపురం దేవయ్య, నమిలకొండ లింగం, వరద అనిల్, భూక్య లింగమూర్తి, అక్కపురం హనుమ్మయ్య, అబ్బేని బీమయ్య.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చెట్కూరి దినేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో శ్రీ రామాంజనేయ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.