📄 ePaper
Friday, September 4, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుయువత క్రీడల వైపు అడుగులు వేయాలి-డివైఎఫ్ఐ పిలుపు.కోనాపూర్ వేదికగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్.

యువత క్రీడల వైపు అడుగులు వేయాలి-డివైఎఫ్ఐ పిలుపు.కోనాపూర్ వేదికగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్.

📰 Generate e-Paper Clip

సంక్రాంతి సంబరాల్లో క్రీడాజోష్‌కు డివైఎఫ్ఐ

•డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ యువతకు పిలుపు

సదాశివపేట,జనవరి13(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో గురువారం డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ-భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు, మహిళల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఈ నెల15-01-2026 (గురువారం) ఉదయం 9 గంటలకు సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌లో మండలంలోని అన్ని గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.పోటీల్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేయబడతాయని తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన క్రీడాకారులు 8317607388, 8886742414 నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవితంలో భాగంగా మలచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్చంద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ఆలమీన్ ప్రిన్సిపల్ ఎం.ఏ. గని, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సంగమేష్, కోనాపూర్ గ్రామస్తులు సద్దాం, దర్శన్, అరుణ్, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.