📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణరోడ్డు భద్రత ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన: తల్లాడఎస్సై

రోడ్డు భద్రత ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన: తల్లాడఎస్సై

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//ఖమ్మం జిల్లా

తల్లాడ పోలీస్ స్టేషన్ రోడ్డు భద్రతపై ప్రజలకు పూర్తి అవగాహన  ఉండాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా తల్లాడ పోలీసుల ఆధ్వర్యంలో తల్లాడలో  రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో జనవరి 1 నుంచి 31 వరకు ప్రభుత్వం రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ వాడకం, త్రిపుల్ రైడింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని హెచ్చరిస్తూ, హెల్మెట్, సీట్ బెల్ట్, సిగ్నల్స్, వేగ పరిమితి, సరైన డాక్యుమెంట్లు తప్పనిసరి అని, ప్రతి పౌరుడు నియమాలు పాటించడమే కాకుండా, రోడ్డుపై ఇతరుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.