📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాజ్‌పల్లిలో ‘కళ్యాణం కమనీయం’ ఫంక్షన్ హాల్ ప్రారంభం-ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు

రాజ్‌పల్లిలో ‘కళ్యాణం కమనీయం’ ఫంక్షన్ హాల్ ప్రారంభం-ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి20,
మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలో నూతన హంగులతో, ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మితమైన “కళ్యాణం కమనీయం” ఫంక్షన్ హాల్ ఘనంగా ప్రారంభమైంది. వివాహాలు, పేరంటాలు, రిసెప్షన్‌లకు అనువైన విశాలమైన మ్యారేజ్ హాల్, సౌకర్యవంతమైన డైనింగ్ హాల్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ఫంక్షన్ హాల్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి యజమాన్యంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హాల్‌ను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, హైటెక్నాలజీతో నిర్మించిన ఈ ఆధునిక వేదిక గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూ యజమాన్యాన్ని అభినందించారు.అనంతరం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి కూడా యజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజ్‌పల్లి సర్పంచ్ దొంతి నారాయణ, గ్రామ వార్డు సభ్యులు, బీజేపీ మెదక్ జిల్లా నాయకుడు వాల్దాస్ మల్లేశం గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు అఖిల, భరత్, రాజమణి, మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రంజిత్ రెడ్డి, నల్లల విజయ్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు నవీన్ కుమార్, చందు గౌడ్ తదితరులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.