📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజక్కన్నపేటలో పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం – ₹50,111 విరాళం అందించిన మాజీ జడ్పీటీసీ పంజా...

జక్కన్నపేటలో పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం – ₹50,111 విరాళం అందించిన మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా: హెచ్.ఘనపూర్ మండలం,జక్కన్నపేట గ్రామం
ఫిబ్రవరి20,
హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాజీ నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ముదిరాజ్‌కు ఆహ్వాన పత్రికలను జక్కన్నపేట గ్రామ సర్పంచ్ చామంతుల సత్యనారాయణ అందజేశారు.ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ తక్షణమే ₹50,111 నగదు విరాళాన్ని ఆలయానికి అందజేశారు. సర్పంచ్ చామంతుల సత్యనారాయణ మాట్లాడుతూ, అడిగిన వెంటనే అమ్మవారికి విరాళం అందించడం గర్వకారణమని తెలిపారు. ఆలయ ధర్మకర్తలు గ్రామస్తులు పంజా విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ముదిరాజ్ కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయని, పెద్దమ్మ తల్లి ఆరాధన తమ సంప్రదాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాలను నిర్వహిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చామంతుల సత్యనారాయణ, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.