📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామాభివృద్ధికి గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ సదస్సు

గ్రామాభివృద్ధికి గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ సదస్సు

📰 Generate e-Paper Clip

•గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణపై అవగాహన సదస్సు విజయవంతం
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి20:
మనకొండూరు మండలం వంతడుపుల గ్రామపంచాయతీలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక అంశంపై (PRA) అవగాహన సదస్సు నిర్వహించారు. జగిత్యాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆర్. శ్రీజ, యు. శృతి, బి. హారిత, బి. స్వాతిక, ఎన్. శ్వేత, ఎస్. భవాని శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. కరీంనగర్ టి.ఆర్.వి.కె ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు.గ్రామ సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలపై చర్చలు జరిపారు. వ్యవసాయానికి సంబంధించి న సామాజిక పటం, వనరుల పటం, పైచార్ట్, కదలిక పటం,జనాభా విశ్లేషణ పైచార్ట్, కాలక్రమ రేఖలను గీసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఈవో గంగాభవాని, సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ గంగాచారి, గ్రామ సెక్రెటరీ మహమ్మద్ అలీ పాల్గొన్నారు. అలాగే రైతులు భూపతి రెడ్డి, చిమ్మరగొట్టు శ్రీనివాస్ రాజిరెడ్డి, సత్తిరెడ్డి, లక్ష్మరెడ్డి, తిరుపతి రెడ్డి, వామన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవీందర్ తదితరులు మరియు గ్రామస్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.