📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమహా ఫామ్ ప్రారంభోత్సవం ఘనంగా

మహా ఫామ్ ప్రారంభోత్సవం ఘనంగా

📰 Generate e-Paper Clip

చైర్మన్ వెంకటయ్య, ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా ప్రారంభం
మనప్రజాప్రతినిధి//అక్బర్పేటభూంపల్లిమండలం.దుబ్బాక నియోజకవర్గం.ఫిబ్రవరి20
దుబ్బాక నియోజకవర్గంలోని పోతారెడ్డి గ్రామంలో నిర్మించిన మహా ఫామ్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యమెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సంయుక్తంగా ఈరోజు ఘనంగా ప్రారంభించారు.మహా ఫామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వెంకటయ్యను ఆహ్వానించగా, ఆయన ఎంపీ రఘునందన్ రావుతో కలిసి హాజరై ఫామ్‌ను ప్రారంభించారు. అనంతరం మహా ఫామ్ సతీష్ ఫామ్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్యకు, ఎంపీ రఘునందన్ రావుకు నిర్వాహకులు ఘన సన్మానం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అక్బర్‌పేట్-భూంపల్లి, దుబ్బాక ప్రాంతాలకు చెందిన పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.