📄 ePaper
Monday, August 24, 2026
Homeతెలంగాణబలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలు

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి నారాయణఖేడ్,ఫిబ్రవరి 15:

నారాయణఖేడ్ లో హిజ్రాలా ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా శుభకార్యం జరిగితే 10 వేల నుండి 20 వేల రూపాయలు డిమాండ్ చేస్తూ కార్యక్రమ నిర్వాహకులు అంత ఇచ్చుకోలేము అని అంటే హంగామా సృష్టిస్తున్నారు.అడిగినంత ఇచ్చుకోలేకపోతే శాపాలు పెట్టడం,అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఈ మధ్య కొత్త పoథాలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖేడ్ పట్టణం నుండి కంగ్టి,అంత్వార్ వెళ్లే దారులలో మరియు నిజాంపేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలకు అడ్డంగా నిలబడి,వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే బూతులు తిడుతూ, గొడవలు చేస్తున్నారు.వారికి పోలీసులు మందలించిన వారి తీరులో మార్పు రావడం లేదు.ద్విచక్ర వాహనాలపై రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.