📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురేపటి ప్రజావాణి రద్దు-ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రకటన

రేపటి ప్రజావాణి రద్దు-ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రకటన

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి15
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం (ఈ నెల 16వ తేదీ) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రకటించారు.వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.జిల్లా అధికార యంత్రాంగం మొత్తం జాతరఎన్నికల విధుల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.