📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచిన్నారి మౌనికకు న్యాయం చేయాలి-దుండగులకు కఠిన శిక్ష విధించాలి

చిన్నారి మౌనికకు న్యాయం చేయాలి-దుండగులకు కఠిన శిక్ష విధించాలి

📰 Generate e-Paper Clip

•హుస్నాబాద్‌లో రజక సంఘం భారీ నిరసన ర్యాలీ
మనప్రజాప్రతినిధి//హుస్నాబాద్ నియోజకవర్గం.ఫిబ్రవరి27
చిన్నారి మౌనికపై జరిగిన దారుణ దాడిని ఖండిస్తూ ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య గట్టిగా డిమాండ్ చేశారు.“బాధిత చిన్నారికి పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ ర్యాలీలో సిద్దిపేట జిల్లా రజక నాయకులు జంగపెల్లి ఐలయ్య, హుస్నాబాద్ మండల రజక నాయకులు పున్న సారయ్య, బీసీ సంఘాల నాయకులు మేకల వీరన్న యాదవ్, పిడిశెట్టి రాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.హుస్నాబాద్ పట్టణ రజక యూత్ అధ్యక్షుడు పున్న రవీందర్, ప్రధాన కార్యదర్శి పున్న రమేష్ (కపిల్), ఉపాధ్యక్షులు బస్వారాజు రాజు, కోశాధికారి పున్న రమేష్ (డిష్), ప్రచార కార్యదర్శి ఉప్పారపెల్లి రాజేష్, సహాయ కార్యదర్శులు పున్న చందు, బస్వారాజు నాగరాజు, కార్యవర్గ సభ్యులు సంఘ అంజి, గంపల రమేష్, గూడెపు సురేష్, వారికోలు అజయ్, సంగ రాకేష్, మిత్ర శంకర్‌తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు.🔴 చిన్నారి మౌనికకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.