📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

•చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పోరాటంకొనసాగిస్తాం. కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి.
(సిద్దిపేటనియోజకవర్గం)ఫిబ్రవరి27: సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామంలో కుమ్మెర ఘటనకు నిరసనగా గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండపాక మండల ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ముస్త్యాల శ్రీకాంత్ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారంతో బీసీ దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు.
రాష్ట్రంలో భవిష్యత్తులో కులదురహంకార హత్యలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై భౌతిక దాడులు జరగకుండా ఉండాలంటే కుమ్మెర ఘటన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు గణేష్, చంద్రకళలకు ప్రభుత్వ పరంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.కేసులో సంబంధం ఉన్న వారందరిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా నిష్పక్ష పాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బీసీ రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు బాధిత కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొండపాక మండల మాజీ ఎంపీటీసీ పోరం అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్, జప్తి నాచారం మాజీ సర్పంచ్ ముస్త్యాల కనకయ్య, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఐటీయూసీ అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్, జప్తి నాచారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముస్త్యాల విష్ణు, బీసీ కుల సంఘ సభ్యులు రామచంద్రం చారి, వడ్లకొండ రాజయ్య గౌడ్, ముస్త్యాల స్వామి, యామ ఉపేందర్ ముదిరాజ్, యామ లవన్ ముదిరాజ్, పోతుగంటి శ్రీశైలం, దూస భాస్కర్, వడ్లకొండ కార్తీక్ గౌడ్, ఎర్రోళ్ల కర్ణాకర్ రజక, ముస్త్యాల కర్ణాకర్, ముస్త్యాల ఉదయ్ కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.