📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఖబర్దార్ భీమ్ రావు:దళిత నాయకుడు బక్కి నవీన్ హెచ్చరిక

ఖబర్దార్ భీమ్ రావు:దళిత నాయకుడు బక్కి నవీన్ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

•చైర్మన్ బక్కి వెంకటయ్యపై దుష్ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు – దళిత నాయకుడు బక్కి నవీన్ హెచ్చరిక మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండలం.ఫిబ్రవరి23
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పై తప్పుడు ప్రచారం చేస్తున్న భీమ్ రావు తీరును దళిత నాయకుడు బక్కి నవీన్ తీవ్రంగా ఖండించారు. సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో దళిత యువకుడు రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి రూ.4,12,000 నష్టపరిహారం అందజేసి, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకో వాలని కమిషన్ ఆదేశించిందని చైర్మన్ వెల్లడించినవిషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని భీమ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని బక్కి నవీన్ అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల దళితులు, దళిత నాయకులు చైర్మన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అపోహలకు లోనుకాకూడదని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.