📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతొర్నాల గ్రామంలో బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ భాగస్వామ్య మూల్యాంకన కార్యక్రమం

తొర్నాల గ్రామంలో బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ భాగస్వామ్య మూల్యాంకన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

•గ్రామీణ వ్యవసాయ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం–బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులగ్రామీణభాగస్వామ్య మూల్యాంకనకార్యక్రమంవిజయవంతం
•రైతులసమస్యలు,వనరులు,పంటలపరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరణ
మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి23
సిద్ధిపేట జిల్లా తొర్నాల గ్రామంలో బిజెఆర్ అగ్రికల్చరల్ కాలేజీ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కార్యానుభవం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ భాగస్వామ్య మూల్యాంకన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామీణ వ్యవసాయ పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన పొందడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.విద్యార్థులు గ్రామ రైతులతో మమేకమై వారి సాగు విధానాలు, వనరులు, అవసరాలు వారు ఎదుర్కొంటున్నసమస్యలపై సమగ్ర సమాచారం సేకరించారు.గ్రామ పటం,వనరుల పటం, పంటల నిష్పత్తి పట్టిక, వ్యవసాయ కాలచక్రం,ప్రమాణ క్రమపద్ధతి, చపాతీ పటం, పంటల కాలపట్టిక, సమస్యల వృక్షం వంటి పద్ధతుల ద్వారా వ్యవసాయ పరిస్థితులను విశ్లేషించారు.రైతులు పురుగుమందుల అధిక వినియోగం, నీటి వనరుల కొరత, మార్కెటింగ్ సమస్యలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు వంటి అంశాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా రైతులకు శాస్త్రీయ సలహాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తొర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు డా. పల్లవి, డా. తబస్సుం ఫాతిమా, వ్యవసాయ విస్తరణాధికారి గీతా, ఒగ్గు రాంబాబు,ఒగ్గు బాలకిషన్ వాసూరి ప్రవీణ్, శతరాసి నవీన్, శనిగరం మల్లయ్య, నిమ్మ చంద్రశేఖర్ రెడ్డి, రాంరెడ్డి గ్రామ రైతులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.