📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొండపాక పాఠశాలకు మైక్ సెట్ విరాళం

కొండపాక పాఠశాలకు మైక్ సెట్ విరాళం

📰 Generate e-Paper Clip

•కొండపాకలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ కొండపాక పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన దాత-రూ.60 వేల విలువైన మైక్ సెట్ అందజేత
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఫిబ్రవరి18
కొండపాక గ్రామంలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ కొండపాక పాఠశాలకు కొండపాక వాస్తవ్యులు, పారిశ్రామికవేత్త, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు, రుద్రేశ్వరాలయం కొండపాక ట్రస్ట్ చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్ సుమారు రూ.60 వేల విలువగల మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు.
పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మైక్ సెట్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. చిన్ననాటి విద్యాభ్యాసం జరిగిన ఈ పాఠశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, గురువులు స్నేహితులతో గడిపిన రోజులను స్మరించుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అనంతుల శ్యామ్ మోహన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాస వీరేశం, ప్రముఖ న్యాయవాది సంజయ్ కృష్ణ, ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్, శారీరక విద్యా ఉపాధ్యాయులు నర్రా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, శోభారాణి, విజయలక్ష్మి, అశోక్, అవారి, బి. తిరుపతి, రవీందర్ రెడ్డి, బాలకిషన్, శ్రీనివాస్ రెడ్డి, రికార్డు సహాయకుడు సాబీర్ హుస్సేన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.