📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమాజీ ఎంపిటీసీ బీఆర్ఎస్ నాయకులు  చిట్యాల సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు.

మాజీ ఎంపిటీసీ బీఆర్ఎస్ నాయకులు  చిట్యాల సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు.

📰 Generate e-Paper Clip

“కార్యకర్త సంక్షేమమే లక్ష్యం-గాయపడిన బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన హరీష్ రావు”
పార్టీ కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే-ఇర్కోడ్‌లో హరీష్-రావు పరామర్శ

(మనప్రజాప్రతినిధి)సిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి6
బీఆర్ఎస్.పార్టీమాజీఎంపిటీసీ నాయకుడుచిట్యాల సత్యనారాయణగౌడ్ ఇటీవల కాలుకు ఫ్రాక్చర్ కావడంతోకరీంనగర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం స్వగృహానికి చేరుకున్న ఆయనను సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఇర్కోడ్ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈసందర్భంగా హరీష్ రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం విషయంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ముందుండి పరామర్శించే నాయకుడిగా హరీష్ రావుకు కార్యకర్తల్లో ప్రత్యేక గౌరవం ఉందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మారెడ్డి లింగారెడ్డి, బొర్ర రాజబాబు, కుంభం సురేష్, మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గుర్రాలగొంది మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పుల్లూరు మాజీ సర్పంచ్ నరేష్, నారాయణ రావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ చందర్రావు, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ వర్మ, మారెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వాసూరి స్వామి, బొప్పిడి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాల్ రెడ్డి, చల్ల అంజిరెడ్డి, చల్ల విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.