📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమల్కాపూర్ తండాలో ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

మల్కాపూర్ తండాలో ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా,ఫిబ్రవరి16(మనప్రజాప్రతినిధి):
మెదక్ జిల్లాలోని మల్కాపూర్ తండాలో బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా ప్రజలు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించి మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. సమాజ ఐక్యత, సేవా భావం పెంపొందించుకోవాలని నాయకులు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మెగావత్ హరినాయక్, నేనావత్ విఠల్ నాయక్, నేనావత్ పరిమేష్ నాయక్, మెగావత్ శంకర్ నాయక్, నేనావత్ రమేష్ నాయక్, నేనావత్ బద్రి నాయక్, నేనావత్ రవి నాయక్, మెగావత్ శ్రీను నాయక్, మెగావత్ రామ్ సింగ్, నేనావత్ బాబు నాయక్, ఆంగోత్ శంకర్ నాయక్, భానోత్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం సమాజ అభివృద్ధికి కలిసి పనిచేయాలని నాయకులు నిర్ణయించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.