📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరంపల్లిలో వీధి కుక్కల దాడి-3 ఏళ్లచిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలింపు

సూరంపల్లిలో వీధి కుక్కల దాడి-3 ఏళ్లచిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలింపు

📰 Generate e-Paper Clip

•3ఏళ్లచిన్నారిపైదాడి-చికిత్సలోచిన్నారి,కుటుంబంలోఆందోళన   •ప్రజలప్రాణభద్రతపైప్రశ్నలు-వెంటనేచర్యలుతీసుకోవాలని ప్రభుత్వానికిగ్రామస్తులడిమాండ్

సిద్దిపేటజిల్లా.దౌల్తాబాద్ మండలంఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):
సూరంపల్లి గ్రామంలో వీధి కుక్కల బీభత్సం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న మూడు సంవత్సరాల చిన్నారి మోక్షితపై కుక్కలు ఆకస్మికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.బాధిత చిన్నారి తండ్రి నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు దాడి చేయగా, కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి చిన్నారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.గ్రామస్తుల ప్రకారం,గత కొంతకాలంగా గ్రామంలో వీధి కుక్కలు తరచూ ప్రజలను వెంటాడుతూ కరుస్తున్న ఘటనలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై జరిగిన తాజా దాడితో ప్రజల్లో తీవ్రఆగ్రహం వ్యక్తమవుతోంది.గ్రామంలో తిరుగుతున్న వీధి కుక్కలను వెంటనే పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించడంతో పాటు, ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. “ఇంకా ఎన్ని ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటారు?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.