📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణయువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి

📰 Generate e-Paper Clip

షారుక్ ఖాన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాధారణ

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్, ఫిబ్రవరి 6:

నారాయణఖేడ్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షారుక్ ఖాన్‌కు రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోంది. యువత రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా షారుక్ ఖాన్ నిలుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. షారుక్ ఖాన్ ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, “యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలి”, “యువతకు ప్రాతినిధ్యం కావాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ముఖ్యంగా యువత, మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో 12వ వార్డులో ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా మారింది.
యువత ఆశలకు ప్రతిబింబంగా నిలుస్తున్న షారుక్ ఖాన్‌కు ఈసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular