📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

అమ్మ ప్రేమను ప్రతిబింబించిన సాంస్కృతిక కార్యక్రమాలు – ఆటల పోటీల్లో విద్యార్థులు, తల్లుల ఉత్సాహభరిత పాల్గొనడం
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మార్చ్9
మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో గల సాయి కృప విద్యాలయంలో శనివారం స్కూల్ హెడ్‌మాస్టర్ వనజ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీజాతి ఔన్నత్యం, ఆమెలోని ప్రేమ స్వరూపం గురించి వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లులతో కలిసి ఆటల పోటీలలో పాల్గొని ఆనందంగా గడిపారు. అలాగే అమ్మ ప్రేమను ప్రతిబింబించే నృత్య ప్రదర్శన చేసి స్త్రీమూర్తుల గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలు ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ సతీమణి అనిత, డాక్టర్ మనిషా, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంజా రమేష్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.