📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణసమాచార హక్కు రక్షణ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరిదీ

సమాచార హక్కు రక్షణ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరిదీ

📰 Generate e-Paper Clip

• సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం – 2005 ఐదవ రాష్ట్ర మహాసభలు

• రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ఆర్టిఐ కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా,మఠంపల్లి మార్చి 25,మనప్రజాప్రతినిధి

సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందమల్ల సుధాకర్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్, బొద్దుకూరి కిరణ్ కుమార్, మహిళా విభాగం సభ్యులు హాజమ్మ, సాత్విక రెడ్డి, యాదాద్రి  జోనల్ ఇంచార్జ్ వంగవీటి శ్రీనివాసరావు హాజరయ్యారై మాట్లాడుతూ..సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజల హక్కులు తెలుసుకునేందుకు, రక్షించుకునేందుకు, ప్రజలు అధికార యంత్రంగాన్నీ ప్రశ్నించడానికి తీసుకువచ్చిందన్నారు. ఆర్టిఐ చట్టం సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రం అని అన్నారు. ఆర్టిఐ చట్టం వచ్చినా 21 సంవత్సరాలలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు అందేలా దోహద పడిందన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలను బహిర్గతం చేసింది ఆర్టిఐ అని అన్నారు. నేడు సహ చట్టం నిర్వీర్యం అవుతుందని, సహచటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని సూచించారు. సైనికులు దేశ రక్షణకు ఏ విధంగా కృషి చేస్తున్నారు, సహ చట్టం కార్యకర్తలు దేశ చట్టాలు, ప్రజాస్వామ్య రక్షణ కొరకు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ అప్పీల్ ల హియరింగ్ ఫై వేగవంతం చేయాలన్నారు. ఉద్దేశపూర్వకంగా, ఆర్టిఐ పై నిర్లక్ష్యం వహిస్తున్న అటువంటి పి.ఐ.ఓ, ఏవోలపై చట్ట ప్రకారం కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సహ చట్టం పకడ్బందీగా అమలు కావడానికి రాష్ట్ర సమాచార కమిషన్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సహ చట్టం అమలుకు ప్రతి జిల్లాలో ఆర్టిఐ అమలు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిఐ దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అధికారులలో కొంతమంది బహిర్గతం చేయడం వల్లే నిరంతరం దరఖాస్తుదారులపై, ఆర్టిఐ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీరి రక్షణకు సంబంధించిన మెమో నెంబర్ 33086 వెంటనే పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అవినీతి అక్రమాలు లేకుండా ప్రతి ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సామాజిక అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా తమ సొసైటీ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందన్నారు. సమాచార హక్కు రక్షణ చట్టం – 2005 సొసైటీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సహచట్టం అమలుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా గ్రామస్థాయి వరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు తమ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్,ఆర్గనైజర్ విద్యాసాగర్,  వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అమీర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నవీన్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు సురేష్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మధు బాబు, వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్, రాహుల్, నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, సూర్యాపేట జిల్లా కమిటీ
సభ్యులు, బత్తిని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఉదయ్ కుమార్, అంజి, పవన్,వీరబాబు, ధనముర్తి రామారావు,శ్రీను, కడప పెంటయ్య, నందిపాటి గురవయ్య,నాగార్జున, సోమేశ్వర్, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి సహ చట్టం కార్యకర్తలు, సూర్యపేట జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.