📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువెలికట్ట అభివృద్ధి కోసం ఎంపీకి వినతి

వెలికట్ట అభివృద్ధి కోసం ఎంపీకి వినతి

📰 Generate e-Paper Clip

••జాతీయ రహదారిపై డివైడర్, డ్రైనేజీ..
🔹 హైమాస్ లైట్ల ఏర్పాటు కోసం వినతి

•అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
🔹 ఎంపీ సానుకూల స్పందన

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఏప్రిల్8
వెలికట్ట గ్రామ పరిధిలోని కీలక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ఎంపీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు.
వెలికట్ట క్రాస్ రోడ్ నుంచి సూర్యాపేట జాతీయ రహదారి వరకు డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణం, హైమాస్ లైట్ల ఏర్పాటు వంటి పనులను త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ఈ పనులు అత్యవసరమని వివరించారు.
ఈ అంశాలపై ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ మానస తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరశురాములు, వార్డు సభ్యులు వజ్రమని రాజు, కొమురవెల్లి శ్రావణి రాజు, గంపల బాబు, దొమ్మాట కావ్య రవి, ఎర్రబోయిన కరుణాకర్, అమ్ముల భాస్కర్, ఇంగాల ముత్యం రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.