📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువృత్తి విద్యతో భవిష్యత్తు బంగారం.. విద్యార్థినులకు ఉపాధి దిశగా దృఢమైన అడుగులు!

వృత్తి విద్యతో భవిష్యత్తు బంగారం.. విద్యార్థినులకు ఉపాధి దిశగా దృఢమైన అడుగులు!

📰 Generate e-Paper Clip

•వృత్తి శిక్షణతో విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు విస్తరణ
🔸 కేజిబివిలో ఇంటర్షిప్ ట్రైనింగ్‌తో నైపుణ్యాల పెంపు
🔸 బ్యూటీ & రిటైల్ రంగాల్లో స్వయం ఉపాధికి దారి
🔸 నైపుణ్యాభివృద్ధితో ఆత్మవిశ్వాసం పెంపు
🔸 రాఘవాపూర్ కేజిబివిలో ఇంటర్షిప్ శిక్షణ విజయవంతం
🔸 30 మంది విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ – స్వయం ఉపాధికి మార్గం సుగమం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఏప్రిల్11
వృత్తి విద్య ఆధారంగా అందిస్తున్న శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మారుతుందని విద్యా నిపుణులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా అర్బన్ మండల పరిధిలోని కస్తూర్భా బాలికల విద్యాలయం, రాఘవాపూర్‌లో ఇంటర్ విద్యార్థినులకు గత నెల 30 నుంచి ఏప్రిల్ 10 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 30 మంది విద్యార్థినులు పాల్గొని ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందారు.
ఈ శిక్షణతో బ్యూటీ అండ్ వెల్‌నెస్, రిటైల్ మార్కెటింగ్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వెంటనే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ఈ కోర్సులు కీలకంగా మారనున్నాయి.
ఇదే క్రమంలో రాఘవాపూర్ కేజిబివి కళాశాలలో ఓకేషనల్ కోర్సులో భాగంగా విద్యార్థినులకు ఇంటర్షిప్ ట్రైనింగ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్ఓ మేడం హేమలత పర్యవేక్షణలో, విటి కోమిరే అశ్విని ఆధ్వర్యంలో కొనసాగింది.
ఈ ఇంటర్షిప్ ద్వారా విద్యార్థినులు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయికి చేరుకుంటారని తెలిపారు.
విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపు లక్ష్యంగా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.