Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు.

కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు.

📰 Generate e-Paper Clip

రూ.3.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ


మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్22
మండలంలోని బందారం నుంచి దర్గా గ్రామం వరకు రూ.3.20 కోట్ల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి చొరవతో, మంత్రివర్యులు సీతక్క అనుమతితో బందారం నుంచి దర్గా వరకు సుమారు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణం మంజూరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కొలుపు గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరీ లింగారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular