📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువిగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్10
దుద్దెడ గ్రామంలో నూతనంగా నిర్మించబడిన చౌడాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ గౌరవ అధ్యక్షులు నూనె కుమార్, చైర్మన్ గుండెల్లి ఆంజనేయులు, వార్డు సభ్యులు జక్కుల ఓజయ్య చేతుల మీదుగా నిర్వహించారు.
దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 15వ తేదీన మైలలు తీయడం, 17వ తేదీన పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు బోనాలు సమర్పించడం, 20వ తేదీన చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, 23వ తేదీన చౌడాలమ్మ కళ్యాణంతో ఉత్సవాలు ముగియనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా భక్తులు, యాదవ సంఘం సభ్యులు, దుద్దెడ గ్రామంతో పాటు కొండపాక మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబోయిన కనకయ్య, నూనె శేఖర్, గుర్రాల కనకయ్య, పెద్ద గొల్ల రమేష్, తుప్పుడు రాజు, గుండెల్లి శీను, కూరాటి బాలమల్లు, దోమల నర్సింలు, పెద్ద గొల్ల కొమురయ్య, గుండెల్లి నర్సింలు, కూరాటి శ్రీనివాస్, కోడెల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular