📄 ePaper
Sunday, August 23, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొండపాక కేజీబీవీలో బయో సైన్స్ గెస్ట్ టీచర్ పోస్టు.. దరఖాస్తులకు ఆహ్వానం

కొండపాక కేజీబీవీలో బయో సైన్స్ గెస్ట్ టీచర్ పోస్టు.. దరఖాస్తులకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

జూలై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ – ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
కొండపాకమండలం//జూలై1 (మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో బయో సైన్స్ గెస్ట్ టీచర్ పోస్టు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బి.ఎడ్. ఉత్తీర్ణతతో పాటు టెట్ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుందని తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల ధృవపత్రాల ప్రతులను 2026 జూలై 2లోపు కేజీబీవీ, కొండపాక కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం కేజీబీవీ కొండపాక స్పెషల్ ఆఫీసర్ను 9392510825 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.