📄 ePaper
Thursday, August 20, 2026
Homeతెలంగాణఅర్జున అవార్డులతో తెలంగాణకు గర్వకారణం

అర్జున అవార్డులతో తెలంగాణకు గర్వకారణం

📰 Generate e-Paper Clip

గాయత్రి, ధనుష్‌కు సీఎం అభినందనలు
జాతీయ క్రీడా పురస్కారాల విజేతలకు శుభాకాంక్షలు
యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రతిభ
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
హైదరాబాద్,ఆగస్టు19(మనప్రజాప్రతినిధి): ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి దేశ అత్యున్నత క్రీడా గౌరవాల్లో ఒకటైన అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లు తమ కృషి, పట్టుదల, అంకితభావంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని ముఖ్యమంత్రి తెలిపారు. వారి విజయాలు తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తాయని, అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న క్రీడాకారులు, కోచ్‌లు మరియు ఇతర విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగ అభివృద్ధికి వారు అందించిన సేవలు దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చాయని అన్నారు. క్రీడాకారులు సాధించిన విజయాల వెనుక ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయాలు యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరిన్ని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడా ప్రతిభను వెలికితీయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్‌లు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్రీడా రంగంలో కొత్త శిఖరాలను అధిరోహించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన అభినందన సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.