📄 ePaper
Friday, August 21, 2026
Homeఎడిటోరియల్ప్రధాని మోదీ ఫోటో వేశాకే రేషన్ కార్డులు ఇవ్వాలి

ప్రధాని మోదీ ఫోటో వేశాకే రేషన్ కార్డులు ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

రేషన్ కార్డులపై సీఎం,మంత్రుల ఫొటోలు ఎందుకు?
– బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఆగస్టు15
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై బెజ్జంకి బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలను ముద్రించడం సరికాదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశాంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ ద్వారా అందిస్తున్న ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అయితే స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే కార్డుల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కూడా స్పష్టంగా ప్రతిబింబించాలని దొడ్ల ప్రశాంత్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను రేషన్ కార్డులపై ఖచ్చితంగా ముద్రించిన తర్వాతే కార్డుల పంపిణీ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కార్డులపై ఫొటోల అంశం రాజకీయ వివాదానికి దారితీసింది.
రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు అందుతున్న బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాల రూపకల్పన చేయకుండా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశాంత్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.