మనప్రజాప్రతినిధి//కొండపాకమండల్.సెప్టెంబర్7
మర్పడగ గ్రామంలోని శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో ఆదివారం నాడు ఆర్ద్రా మహోత్సవం భక్తిశ్రథ్ధలతో నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో గణపతిపూజ,స్వస్తివాచనం నిర్వహించి, నవగ్రహ, దిక్పాలక, రుద్రకలశ స్థాపన చేశారు. స్థాపిత దేవత పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం, సుబ్లహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. తర్వాత స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి జరిగాయి. విజయదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. మోహనకృష్ణశర్మ శర్మల వైదిక నిర్వహణలో కార్యక్రమం జరుగగా ఋత్విజులుగా బి.లక్ష్మణరావు, క్రిష్ణకిషోర్ పాండే క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి రాజేంద్రప్రసాద్ మర్యాలవీరేశం, తదితరులు పాల్గొన్నారు.
మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రామహోత్సవం
RELATED ARTICLES



