మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్7
సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక ఉత్సవాల నిమిత్తం ఓ భారీ గణేశుడి విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ సహాయంతో గణనాథుడిని ట్రాలీలో తీసుకెళ్తున్న సమయంలో వెనుక నుంచి ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న బారి గణేష్ విగ్రహం కిందపడి ధ్వంసం అయిపోయింది. ఐదుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొందరు యువకులు వినాయక ఉత్సవాల కోసం హైదరాబాదులో ఓ భారీ గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేశారు. దాన్ని ట్రాక్టర్ పై ఎక్కించి స్వగ్రామానికి బయలుదేరారు. విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ దుద్దెడ చివరి వరకు చేరుకోగా యువకులు రోడ్డుపై దిగి కర్ర సహాయంతో వైర్లను సరి చేస్తున్న క్రమంలో సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ట్యాంకర్ వినాయకుడి విగ్రహం ను ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈనెల 14న గణనాథుడిని ప్రతిష్టించేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ సహాయంతో గణనాథుడిని ట్రాలీలో 8 మంది యువకులు కొత్తగూడెంకు తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నారు.



