మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.సెప్టెంబర్21
కొండపాక మండలంలోని మార్పడగ గ్రామంలో శ్రీ ఆంజనేయం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వినాయకుడి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు, అక్కాచెల్లెళ్లు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
మహిళలు ఆలపించిన భక్తిగీతాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మర్పడగలో ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం.
RELATED ARTICLES



