📄 ePaper
Friday, September 18, 2026
Homeతెలంగాణగర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ హెచ్ పి వి ని ఉపయోగించుకోండి ప్రభుత్వ వైద్యులు నిపున్

గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ హెచ్ పి వి ని ఉపయోగించుకోండి ప్రభుత్వ వైద్యులు నిపున్

📰 Generate e-Paper Clip

మన ప్రజా ప్రతినిధి దినపత్రిక మిర్యాలగూడ సెప్టెంబర్17


బాలికలకు మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ హెచ్ పి విని ఉపయోగించుకోవడం గురించి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రకాష్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నిపున్  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిపుణు మాట్లాడుతూ 13 నుండి 14 సంవత్సరాల బాలికలు ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కి అర్హులని ప్రభుత్వం వీరికి ఖరీదైన వ్యాక్సిన్ని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు ఈ వ్యాక్సిన్ వలన గర్భాశయ ముఖ క్యాన్సర్ సర్వయికల్ క్యాన్సర్  ఇతర క్యాన్సర్లను కూడా రాకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని, దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ఎక్కువ ధర ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశమును అర్హులైన ప్రతి విద్యార్థిని   సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి ఆపొహ చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులందు రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేయించుకోవచ్చని తెలియజేశారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన మంచి అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలల 13 నుండి 14 సంవత్సరాల విద్యార్థిని లు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు రజిత ఉమారాణి సునంద జ్యోతి పద్మజ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.