📄 ePaper
Friday, October 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేట ప్రత్యేక పోస్టల్ డివిజన్ కోసం దీక్ష

సిద్దిపేట ప్రత్యేక పోస్టల్ డివిజన్ కోసం దీక్ష

📰 Generate e-Paper Clip

•ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట
•దీక్షలో సంఘీభావం తెలిపిన మెదక్ డివిజన్ నాయకులు
•బీపీఈఏ ఆధ్వర్యంలో నిరసన.. తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎం. కిషోర్ పిలుపు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.అక్టోబర్30
సిద్దిపేట ప్రత్యేక పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీపీఈఏ(బీఎంఎస్)ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. తెలంగాణ సర్కిల్ సెక్రటరీ ఎం. కిషోర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ దీక్షలో పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నిరసన తెలిపారు.
ఈ దీక్షలో మెదక్ డివిజన్ కార్యదర్శిడి.శ్రీనివాస్,మెదక్ డివిజన్ పోస్ట్‌మెన్ అధ్యక్షుడుయు.మల్లయ్య,మెదక్ జీడీఎస్ కార్యదర్శి మురళి,బి.రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.దీక్షకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కలాల్ శ్రీనివాస్, బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి సంఘీభావం తెలిపారు.
సిద్దిపేట ప్రాంత ప్రజలకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సిద్దిపేట పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన పోస్టల్ పరిపాలనను ప్రత్యేక డివిజన్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రత్యేక సిద్దిపేట పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్‌ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేటకు ప్రత్యేక పోస్టల్ డివిజన్ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.