📄 ePaper
Friday, October 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

కేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

📰 Generate e-Paper Clip

“ఆరోగ్యంబాగోలేదనిచెప్పి..తెల్లవారుజామున ఆసుపత్రికితరలింపు
“తల్లిదండ్రులు చేరుకునేలోపే మృతి..తండ్రి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
మనప్రజాప్రతినిధి//అక్టోబర్30:సిద్దిపేటనియోజకవర్గంరూరల్‌: రాఘవాపూర్‌ కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని లాస్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. విద్యార్థిని మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్దిపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడికందుల గ్రామానికి చెందిన దాపులగల్ల సంతోష్ కుమార్తె లాస్య రాఘవాపూర్‌ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్‌ 24న కుటుంబ సభ్యులు ఆమెను పాఠశాలలో విడిచిపెట్టారు.
అక్టోబర్‌ 28న ఉదయం సుమారు 9 గంటలకు పాఠశాల ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి లాస్య ఆరోగ్యం బాగాలేదని సమాచారం ఇచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 9.30 గంటలకు మరోసారి ఫోన్‌ చేసి లాస్యకు రెండు మూడు రోజుల క్రితమే రుతుస్రావం ప్రారంభమైందని, ఉదయాన్నే వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.
దీంతో కుటుంబ సభ్యులు తెల్లవారుజామున పాఠశాలకు వస్తామని తెలిపారు. అయితే అక్టోబర్‌ 29న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి లాస్య ఆరోగ్యం విషమించడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని, అక్కడికి రావాలని సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన తల్లిదండ్రులు, బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేలోపే లాస్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థిని మృతిపై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.