Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుదుద్దెడ గ్రామ సర్పంచ్ బరిలో శ్రీనివాస్

దుద్దెడ గ్రామ సర్పంచ్ బరిలో శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

నాయకుడిగా కాదుప్రజాసేవకుడిగాముందుంటా
మనప్రజాప్రతినిధి,కొండపాక మండలం. డిసెంబర్ 2
దుద్దెడ గ్రామ సర్పంచ్ పదవికి ఆరేపల్లి శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు విని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో మెలిగే స్వభావంతో గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు.
గ్రామంలో తాగునీటి సరఫరా, కాలువలు, పారిశుద్ధ్యం, కోతుల బెడద వంటి ప్రధాన సమస్యలను శాశ్వత పరిష్కారాల దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల అండదండలతో కష్టసుఖాల్లో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడం తన బాధ్యత, లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు.
“ఒక నాయకుడిగా కాదు.దుద్దెడ గ్రామానికి సేవకుడిగా పని చేయడం నా దేయం” అని గ్రామ ప్రజలకు వినమ్ర వినతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular