Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅభ్యర్థులఖరారుగ్రామాల్లోరాజుకున్నఎన్నికలవేడి

అభ్యర్థులఖరారుగ్రామాల్లోరాజుకున్నఎన్నికలవేడి

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మనప్రతినిధి//డిసెంబర్ 03
గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో పూర్తికావడంతో మండలంలోని 40 పంచాయతీల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. దీంతో గ్రామాల్లో రాజకీయ ఉత్సాహం, ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారం వెంటనే ఊపందుకోనుంది.
6 పంచాయతీలు ఏకగ్రీవం40 గ్రామపంచాయతీలలో నామాపూర్, మల్లంపేట్, కందిపల్లి, అమ్రియా తాండా, యూసుఫ్‌పేట్, లక్ష్మీనగర్ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించాయి. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలు రెండూ ఎలాంటి పోటీ లేకుండా ఖరారయ్యాయి.
బహుముఖ పోటీలు అనివార్యంమిగిలిన పంచాయతీల్లో ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం పోటీలు నెలకొన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల మధ్యే పోటీ ఎక్కువగా ఉండడం ఆసక్తికరంగా మారింది. పాపన్నపేట పంచాయతీలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు కీలక అభ్యర్థులు బరిలోకి దిగడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
పార్టీల ప్రమేయం స్పష్టంగా గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఉన్నప్పటికీ, స్థానిక నేతల ప్రభావం పలు చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు బరిలో నిలవడం కూడా చర్చనీయాంశమైంది.
దావత్‌లు, ఇంటింటి ప్రచారం మొదలు
తడిపొడి దావత్‌లు, ప్రత్యేక విందులు, ఇంటింటి ప్రచారం పల్లెల్లో మొదలయ్యాయి. రాత్రి వేళల్లోనూ అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా 5–10 ఓట్లు ఉన్న కుటుంబాలపై దృష్టి పెట్టడం ప్రారంభమైంది.రిజర్వేషన్ ఉన్న చోట్ల తక్కువ ఖర్చు జనరల్ స్థానాల్లో భారీ పోటీరిజర్వేషన్లు ఉన్న పంచాయతీల్లో ప్రచారం సరళంగా సాగుతుండగా, జనరల్ స్థానాల్లో ఖర్చు, పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఓటర్లలో ఆసక్తిఎవరు గెలుస్తారోనన్న చర్చలుసర్పంచి పదవి ఎవరు దక్కించుకుంటారన్న విషయంపై గ్రామాల్లో చర్చలు వేడెక్కాయి.మరో వారం రోజుల్లో ఓటర్ల తీర్పు వెల్లడి కానుండటంతో అభ్యర్థులు వేగంగా ప్రచారంలో దిగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular