📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్వర్షాలప్రభావంతోమేర్లపాకఅంగన్వాడీభవనంకూలిపోయిపెద్దప్రమాదంతప్పిందిగ్రామస్థులఆవేదన,కొత్తభవనంనిర్మించాలనిడిమాండ్

వర్షాలప్రభావంతోమేర్లపాకఅంగన్వాడీభవనంకూలిపోయిపెద్దప్రమాదంతప్పిందిగ్రామస్థులఆవేదన,కొత్తభవనంనిర్మించాలనిడిమాండ్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం.డిసెంబర్3
ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామంలో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గ్రామంలోని పాత అంగన్వాడీ భవనం సోమవారం అకస్మాత్తుగా కూలిపోయింది. గత కొద్దిరోజులుగా గోడలు తడిసి బలహీనమైనా, వర్షం తీవ్రత పెరిగిన సమయంలో పూర్తిగా కూలిపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. అయితే ఆ సమయానికి భవనంలో అంగన్వాడీ పిల్లలు లేకపోవడం దేవుడి దయగా పెద్ద ప్రమాదం తప్పింది.
అంగన్వాడీ ప్రాంగణంలో వర్షపు నీరు అధికంగా నిల్వ ఉండడం, భవనం చుట్టూ మట్టి మరింత సడలిపోవడం వంటి సమస్యలు ముందే గుర్తించిన నేపధ్యంలో గత వారం నుంచే అంగన్వాడీ పిల్లలను పక్కనే ఉన్న ఎంపీపీ స్కూల్‌కు తరలించినట్లు అంగన్వాడీ టీచర్ వివరించారు. “వర్షాల వల్ల పరిస్థితి సురక్షితంగా లేదని గ్రహించి పిల్లల్ని ముందుగానే తరలించాం… లేకపోతే ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగిపోయేది” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
భవనం పూర్తిగా నేలమట్టమవడంతో గ్రామ ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన వ్యక్తమైంది. సంవత్సరాలుగా భవనం మరమ్మతులు లేకపోవడం, నీటిం నిలిచే డ్రైనేజ్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే ప్రతి సారి భవనం గురించి భయపడాల్సిన పరిస్థితి వచ్చేదని పేర్కొన్నారు.
ఈనేపథ్యంలో గ్రామ పెద్దలు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు అందరూ కలిసి ప్రభుత్వ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. “మా పిల్లల భద్రత అత్యంత ముఖ్యం. అదే స్థలంలో పటిష్టమైన, నూతన అంగన్వాడీ భవనం నిర్మించాలి. పిల్లలు ఎలాంటి ప్రమాదం ఎదుర్కోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి” అని గ్రామస్తులు కోరుతున్నారు.
తాత్కాలికంగా పిల్లలు ఎంపీపీ స్కూల్‌లో కొనసాగుతున్నప్పటికీ, ఎక్కువసేపు రెండు పాఠశాలల కార్యకలాపాలు ఒకే భవనంలో నిర్వహించడం ఇబ్బందులకు దారి తీస్తోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఈ ఘటనపై నివేదిక సిద్ధం చేసి అధికారులకు పంపించేందుకు కృషి చేస్తోంది.
గ్రామ ప్రజల డిమాండ్‌పై సంబంధిత శాఖలు త్వరితగతిన స్పందించాలంటూ స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.