📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుడంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదంఅక్బరుపేట భూంపల్లి మండలం

డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదంఅక్బరుపేట భూంపల్లి మండలం

📰 Generate e-Paper Clip



మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం, సిద్దిపేటజిల్లాడిసెంబర్ 17
అక్బర్‌పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని పాత ఇనుప సామాన్ల డంపింగ్ యార్డులో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ వస్తువులు, రాగి, సిల్వర్ తదితర సామాన్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.ఈ ప్రమాదాన్ని గమనించిన భూంపల్లి మాజీ ఎంపీటీసీ నరేష్, అక్బర్‌పేట్ సర్పంచ్ మండల కుమార్ వెంటనే స్థానిక ఎస్ఐ హరీష్ గౌడ్‌కు సమాచారం అందించారు. ఎస్ఐ హరీష్ గౌడ్ తక్షణమే దుబ్బాక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, అక్కడి నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular