•బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం తప్పదు: •కాంగ్రెస్గాంధీ పేరును తొలగించడం దేశద్రోహమే – మార్క సతీష్ కుమార్ గౌడ్.•సిద్దిపేటలో కాంగ్రెస్ ఉద్యమానికి ముందుండి నడిపిస్తున్న మార్క సతీష్
సిద్దిపేటనియోజకవర్గం,మనప్రజాప్రతినిధి//డిసెంబర్21
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటలకు సిద్దిపేట గాంధీ విగ్రహం వద్ద, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తూంకుంట ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగనుంది.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ,
“మహాత్మా గాంధీ గారి పేరు దేశానికి గుర్తు. ఆ పేరును ఉపాధి హామీ చట్టం నుంచి తొలగించడం దేశ చరిత్రను తుడిచివేయడమే. ప్రజల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం పోరాడుతాం. ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తూముకుంట నర్సారెడ్డి, సూర్య వర్మ, తాడూరు శ్రీనివాస్, నయిని నరసింహారెడ్డి, జి. శ్రీనివాస్,పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి,
కౌన్సిలర్లు మున్నా రియాజుద్దీన్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు బిజాని ఎల్లమ్మ, భవాని, పద్మశ్రీ,నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవితేజ,గుండు సురేష్, శ్రీనివాస్, రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు.దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని సిద్దిపేటలో విజయవంతం చేయడంలో మార్క సతీష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసారని మార్క సతీష్ కుమార్ గౌడ్
ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ.అధ్యక్షులు – సిద్దిపేట జిల్లా గౌడ సంఘం మదర్ తెరిసా భారతరత్న గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన
RELATED ARTICLES

