📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన.నాణ్యతలో రాజీ లేదు-సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన.నాణ్యతలో రాజీ లేదు-సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం. డిసెంబర్24
కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను బుధవారం సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు హౌసింగ్ ఏఈ శిల్పతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి దశలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అధికారులు పూర్తైన పనుల ఫోటోలను వెంటనే క్యాప్చర్ చేసి, తద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు ఆలస్యం కాకుండా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.అనంతరం లబ్ధిదారులతో మాట్లాడిన సర్పంచ్, తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.