•ఉచిత ఆరోగ్య బీమా కార్డుల పంపిణీ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో, “ఆటో కార్మికులకు బీమా – కేటీఆర్ ధీమా” అనే స్ఫూర్తితో కొలనూర్ గ్రామంలోని ఆటో కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా కార్డులను పంపిణీ చేశారు.బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు తన ఉదారతను చాటుకుంటూ, ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ ఉచిత ఆరోగ్య భద్రతను కల్పించారు.గురువారం కొలనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆటో కార్మికులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెక్కాడితే గానీ డొక్కాడని ఆటో కార్మికుల సంక్షేమం కోసం చల్మెడ లక్ష్మీనరసింహరావు గారు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయ మని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు కార్మికులకు ఆర్థికంగా, మానసికంగా భరోసానిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉపసర్పంచ్ బిట్ల బాబు, మెరుగు శ్రీనివాస్, ఐలెన్ సంపత్ రావు, నందగిరి అశోక్ గౌడ్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.తమ ఆరోగ్యానికి భరోసా కల్పించినందుకు ఆటో కార్మికులు కేటీఆర్ గారికి, చల్మెడ లక్ష్మీనరసింహరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కొలనూర్ ఆటో కార్మికులకు ‘చల్మెడ’ భరోసా
RELATED ARTICLES

