📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅక్షరాలకు అక్షయ వెలుగు నింపిన సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా

అక్షరాలకు అక్షయ వెలుగు నింపిన సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా

📰 Generate e-Paper Clip

మొదటి మహిళా ఉపాధ్యాయురాలికి ఘన నివాళులు
సదాశివపేట,జనవరి3(మనప్రజాప్రతినిధి):
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉప్పరి విట్టల్ ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కోనాపూర్ బక్కప్ప మాట్లాడుతూ,సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను కొనసాగించి, మహిళా విద్యకు బాటలు వేసిన ధీర వనితగా ఆమెను కొనియాడారు.మహిళా హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషి అపూర్వమని పేర్కొన్నారు. గర్భిణులైన వితంతువులకు రక్షణ కల్పించేందుకు ‘బాలహత్యా ప్రతిబంధక గృహం’ ఏర్పాటు చేయడం ఆమె మానవతావాద దృక్పథానికి నిదర్శనమని తెలిపారు.సావిత్రిబాయి పూలే గొప్ప రచయిత్రి కూడా అని,‘కావ్య ఫూలే’, ‘బావన్న కాశి సుబోధ్ రత్నాకర్’ వంటి రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని వివరించారు.
అప్పటి కాలంలో సంప్రదాయవాదుల నుండి అవమానాలు ఎదురైనా, పాఠశాలకు వెళ్లే మార్గంలో రాళ్లు, పేడ విసిరినా అవేమీ లెక్కచేయ కుండా మరో చీరను సంచిలో పెట్టుకొని పాఠశాలకు చేరుకుని విద్య బోధించిన ధైర్యశాలినిగా ఆమెను స్మరించారు.1897లో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు సేవలందిస్తూ ఆమె కూడా ఆ వ్యాధికి గురై ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే సేవలకు గౌరవంగా జనవరి 3ను భారత ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా గుర్తించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కోనాపూర్ బక్కప్ప, జనరల్ సెక్రటరీ వెంటూరి శివ శంకర్, ఉప సర్పంచ్ బొడ నర్సింలు, అంజిరెడ్డి, కుమార్, ఆటుగారి శివకుమార్, జ్యోతి రాజ్, మోహన్ రెడ్డి, రాజ్ కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.