📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణఒకటో వార్డు రగుడులోయువతకు క్రికెట్ బ్యాట్ల పంపిణీ

ఒకటో వార్డు రగుడులోయువతకు క్రికెట్ బ్యాట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి
రాజన్న సిరిసిల్ల
జనవరి ,11

రాజన్న సిరిసిల్ల జిల్లా
స్థానిక సిరిసిల్ల ఒకటో వార్డు రగుడు ప్రాంతంలో దొంతల చంద్రం ఆధ్వర్యంలో యువతకు క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని యువకులను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన స్వయంగా క్రికెట్ బ్యాట్లను అందజేశారు.
ఈ సందర్భంగా దొంతల చంద్రం మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమకు అండగా నిలుస్తూ బ్యాట్లను పంపిణీ చేసిన చంద్రంకు ఈ సందర్భంగా వార్డు యువత కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular