📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్లలో మున్సిపల్ నగారా...

సిరిసిల్లలో మున్సిపల్ నగారా…

📰 Generate e-Paper Clip

రిజర్వేషన్లఉత్కంఠ..ఆశావాహుల పైరవీలు!రిజర్వేషన్ల గెజిట్ కోసం ఎదురుచూపులు…ఆశావాహుల్లోటెన్షన్
మనప్రజాప్రతినిధి//
రాజన్నసిరిసిల్ల.
జనవరి17
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారికంగా ఎన్నికల నగారా మోగకముందే పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంటుండటంతో, కౌన్సిలర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతల గుండెల్లో ఆందోళన పెరిగింది.
రిజర్వేషన్ల లెక్క… ఎవరి వైపు?
ప్రస్తుతం సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో ప్రధాన చర్చ అంతా రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతోంది.పాత రిజర్వేషన్లే కొనసాగుతాయా? లేక రొటేషన్ పద్ధతిలో మార్పులు జరుగుతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.తమ వార్డు జనరల్ నుంచి రిజర్వ్‌డ్‌గా మారితే పరిస్థితి ఏంటి? మహిళా కోటాలోకి వెళ్తే కుటుంబ సభ్యులను బరిలోకి దించాలా? అనే లెక్కల్లో నేతలు మునిగిపోయారు.
రిజర్వేషన్ల గెజిట్ విడుదలయ్యే వరకు ఏ అడుగు ముందుకు వేయాలో తెలియక ఆశావాహులుసందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు
టికెట్ వేటలో ‘పైరవీ’ రాజకీయం
పార్టీ టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు పైరవీలకు తెరలేపారు. జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ విధేయతను చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అగ్రనేతల ప్రసన్నం కోసం పయనం
రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఇప్పటికే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు సోషల్ మీడియా వేదికగా తమ సేవలు, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వేలు
వార్డుల్లో గెలుపు గుర్రాలను గుర్తించేందుకు పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరికీ టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న కోణంలో వడపోత కొనసాగుతోంది.
ఒకవైపు రిజర్వేషన్ల మార్పుల ఉత్కంఠ, మరోవైపు పార్టీ టికెట్ దక్కుతుందో లేదో అన్న టెన్షన్… ఈ రెండూ కలసి సిరిసిల్ల మున్సిపల్ రాజకీయం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది.
రిజర్వేషన్ల ప్రకటన వెలువడగానే ఈ రాజకీయ వేడి మరింత పెరగడం ఖాయం. కొత్త ముఖాలకు అవకాశం దక్కుతుందా? లేక పాతవారికే మరోసారి అదృష్టం వరిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.