📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రతి గ్రామంలో బీజేపీ జెండాఎగరాల్సిందే..ఇదే లక్ష్యం!

ప్రతి గ్రామంలో బీజేపీ జెండాఎగరాల్సిందే..ఇదే లక్ష్యం!

📰 Generate e-Paper Clip

ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షులు భూమల్లఅనిల్ కుమార్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి16
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ,“రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాల్సిందే. పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేస్తాం. కార్యకర్తలే మా బలం, కార్యకర్తలే మా శక్తి” అని గర్జించారు.బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బత్తిని సాయి గౌడ్, మేకల మల్లేశం, అసెంబ్లీ కోకన్వీనర్ బత్తిని స్వామి, మండల నాయకులు పినికాశి అనిల్, బూత్ అధ్యక్షులు దూది సుధీర్, తుమ్మలపల్లి కమలాకర్ రావు, పిల్లి గోపాల్, కొనబోయిన బాలరాజు, నాయకులు బెంద్రం రాజు, తిప్పర వేణి, శ్రీనివాస్ తదితరులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.