📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా: యువత ఓటు హక్కు వినియోగించాలి

జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా: యువత ఓటు హక్కు వినియోగించాలి

📰 Generate e-Paper Clip

సిద్దిపేట:జనవరి23(మనప్రజాప్రతినిధి)
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని, సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు, అధ్యాపకులు,తల్లిదండ్రు లను ఉత్సాహపరిచుతూ అన్నారు:
ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించి దేశ అభివృద్ధికి భాగస్వామి కావాలి. యువత ఓటరు నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బాధ్యతాయుత పౌరులుగా మెలగాలి.”
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధరిపల్లి నగేష్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి, దేశ అభివృద్ధికి, సమర్థ నాయకులను ఎన్నుకోవడానికి యువత చురుకుగా పాల్గోవాలి అని చెప్పారు.అవార్డులు, అవగాహన కార్యక్రమాలు ద్వారా విద్యార్థులు ఓటరు అవగాహన ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాలలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు హక్కు ప్రాముఖ్యతపై సందేశాలు అందించారు.కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్స్ కౌన్సిలర్లు కనక చంద్రం, ఫాతిమా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ధరిపల్లి నగేష్, స్పోర్ట్స్ ఇంచార్జ్ అశోక్, అధ్యాపకులు రఘురాజ్, గంగాధర్, వెంకటరమణ, శ్రీకాంత్, రాజలక్ష్మి, నరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, కొమురయ్య, రవి, శ్రీకాంత్, విజయభాస్కర్, రాజశేఖర్, సత్యనారాయణ, దాస్, శ్రీనివాస్, చక్రవర్తి మరియు కళాశాల సిబ్బంది విఠల్, రషీద్, రమేష్, వెంకటేష్, శంకర్, కలీం, బాలకిషన్, నయీమున్నీసా తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని కట్టుబాట్లుగా నిర్ణయించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.